Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, October 11, 2013

ఆదికాండము 5

Gen 5:1  ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;
Gen 5:2  మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
Gen 5:3  ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
Gen 5:4  షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
Gen 5:5  ఆదాము బ్రదికిన దిన ములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Gen 5:6  షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.
Gen 5:7  ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
Gen 5:8  షేతు బ్రదికిన దిన ములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Gen 5:9  ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.
Gen 5:10  కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
Gen 5:11  ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయి దేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Gen 5:12  కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.
Gen 5:13  మహలలేలును కనినతరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
Gen 5:14  కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Gen 5:15  మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.
Gen 5:16  యెరెదును కనినతరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పదియేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
Gen 5:17  మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Gen 5:18  యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.
Gen 5:19  హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
Gen 5:20  యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Gen 5:21  హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.
Gen 5:22  హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తె లను కనెను.
Gen 5:23  హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.
Gen 5:24  హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
Gen 5:25  మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.
Gen 5:26  మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
Gen 5:27  మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Gen 5:28  లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమా రుని కని
Gen 5:29  భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయము లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు
Gen 5:30  లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
Gen 5:31  లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Gen 5:32  నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.

No comments:

Post a Comment