Gen 43:1 ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక
Gen 43:2 వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రిమీరు మరల వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా
Gen 43:3 యూదా అతని చూచిఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.
Gen 43:4 కాబట్టి నీవు మాతమ్ముని మాతో కూడ పంపిన యెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము.
Gen 43:5 నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మను ష్యుడుమీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను.
Gen 43:6 అందుకు ఇశ్రాయేలుమీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా
Gen 43:7 వారు ఆ మనుష్యుడుమీ తండ్రి యింక సజీవుడై యున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండిత ముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితిమి -మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి.
Gen 43:8 యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచిఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము;
Gen 43:9 నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టనియెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును.
Gen 43:10 మాకు తడవు కాక పోయినయెడల ఈపాటికి రెండవ మారు తిరిగి వచ్చి యుందుమని చెప్పగా
Gen 43:11 వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితొ అట్లయిన మీ రీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొని పోవుడి.
Gen 43:12 రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడ చేత పట్టు కొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును;
Gen 43:13 మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి.
Gen 43:14 ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీను డనై యుండవలసిన యెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను.
Gen 43:15 ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని, చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి.
Gen 43:16 యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహ కునితో ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను.
Gen 43:17 యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యు లను యోసేపు ఇంటికి తీసికొనిపోయెను.
Gen 43:18 ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడిమొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి.
Gen 43:19 వారు యోసేపు గృహనిర్వాహకునియొద్దకు వచ్చి యింటి ద్వారమున అతనితో మాటలాడి
Gen 43:20 అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి.
Gen 43:21 అయితే మేము దిగినచోటికి వచ్చి మా గోనెలను విప్పి నప్పుడు, ఇదిగో మా మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో నుండెను. అవి చేతపట్టుకొని వచ్చితిమి.
Gen 43:22 ఆహారము కొనుటకు మరి రూకలను తీసికొని వచ్చితిమి; మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి.
Gen 43:23 అందుకతడుమీకు క్షేమమగును గాక భయపడకుడి; మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారియొద్ద
Gen 43:24 ఆ మనుష్యుడు వారిని యోసేపుఇంటికి తీసికొని వచ్చి వారికి నీళ్లియ్యగా వారు కాళ్లు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను.
Gen 43:25 అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధముచేసిరి.
Gen 43:26 యోసేపు ఇంటికి వచ్చి నప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి.
Gen 43:27 అప్పుడుమీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంక బ్రతికి యున్నాడా? అని వారి క్షేమసమాచారము అడిగి నందుకు వారు
Gen 43:28 నీ దాసుడైన మా తండ్రి ఇంక బ్రదికియున్నాడు క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి.
Gen 43:29 అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచిమీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక
Gen 43:30 అప్పుడు తన తమ్మునిమీద యోసేపు నకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను.
Gen 43:31 అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను.
Gen 43:32 అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు; అది ఐగుప్తీ యులకు హేయము.
Gen 43:33 జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్య పడిరి.
Gen 43:34 మరియు అతడు తనయెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.

No comments:
Post a Comment