Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, October 10, 2013

ఆదికాండము 46

Gen 46:1  అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను.
Gen 46:2  అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడుయాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుక తడుచిత్తము ప్రభువా అనెను.
Gen 46:3  ఆయననేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడనిన్ను గొప్ప జనముగా చేసెదను.
Gen 46:4  నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చె దను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసి కొని వచ్చెదను, యోసేపు నీ కన్నులమీద తన చెయ్యి యుంచునని సెలవియ్యగా
Gen 46:5  యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్లెను. ఫరో అతని నెక్కించి తీసికొని వచ్చుటకు పంపిన బండ్లమీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి యైన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి.
Gen 46:6  వారు, అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను తాము కనానులో సంపా దించిన సంపద యావత్తును తీసికొని ఐగుప్తునకు వచ్చిరి.
Gen 46:7  అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతోకూడ తీసికొనివచ్చెను.
Gen 46:8  యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే;
Gen 46:9  యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ.
Gen 46:10  షిమ్యోను కుమారులైన యెమూ యేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయు రాలి కుమారుడైన షావూలు.
Gen 46:11  లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి
Gen 46:12  యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.
Gen 46:13  ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.
Gen 46:14  జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహ లేలు.
Gen 46:15  వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు.
Gen 46:16  గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ.
Gen 46:17  ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరి యైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.
Gen 46:18  లాబాను తన కుమార్తెయైన లేయా కిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను.
Gen 46:19  యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను.
Gen 46:20  యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తుదేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను.
Gen 46:21  బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు.
Gen 46:22  యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు.
Gen 46:23  దాను కుమారుడైన హుషీము.
Gen 46:24  నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.
Gen 46:25  లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు.
Gen 46:26  యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు.
Gen 46:27  ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తు నకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బది మంది.
Gen 46:28  అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా
Gen 46:29  యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీద పడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను.
Gen 46:30  అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతోనీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను.
Gen 46:31  యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినిచూచినేను వెళ్లి యిది ఫరోకు తెలియచేసి, కనానుదేశములో ఉండిన నా సహోదరులును నా తండ్రి కుటుంబపువారును నాయొద్దకు వచ్చిరి;
Gen 46:32  ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొఱ్ఱల కాపరులు. వారు తమ గొఱ్ఱలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొనివచ్చిరని అతనితో చెప్పె దను.
Gen 46:33  గొఱ్ఱల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల
Gen 46:34  మీరు గోషెను దేశమందు కాపురముండునట్లుమా చిన్నతనమునుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వికులును పశువులు గల వారమై యున్నామని ఉత్తరమియ్యుడని చెప్పెను.

No comments:

Post a Comment