Gen 35:1 దేవుడు యాకోబుతోనీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా
Gen 35:2 యాకోబు తన యింటివారితోను తనయొద్ద నున్న వారందరి తోనుమీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.
Gen 35:3 మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నాశ్రమ దినమున నాకుత్తర మిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.
Gen 35:4 వారు తమయొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవు లనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను.
Gen 35:5 వారు ప్రయాణమై పోయినప్పుడు, దేవునిభయము వారి చుట్టున్న పట్టణములమీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు.
Gen 35:6 యాకోబును అత నితో నున్న జనులందరును కనానులో లూజుకు, అనగా బేతేలునకు వచ్చిరి.
Gen 35:7 అతడు తన సహోదరుని యెదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరుపెట్టిరి.
Gen 35:8 రిబ్కా దాదియైన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూరవృక్షము క్రింద పాతిపెట్టబడెను, దానికి అల్లోను బాకూత్ అను పేరు పెట్టబడెను.
Gen 35:9 యాకోబు పద్దనరామునుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని నాశీర్వ దించెను.
Gen 35:10 అప్పుడు దేవుడు అతనితోనీ పేరు యాకోబు; ఇకమీదట నీ పేరు యాకోబు అనబడదు; నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరుపెట్టెను.
Gen 35:11 మరియు దేవుడునేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహ మును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు.
Gen 35:12 నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను; నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను.
Gen 35:13 దేవుడు అతనితో మాటలాడిన స్థలమునుండి పరమునకు వెళ్లెను.
Gen 35:14 ఆయనతనతో మాటలాడినచోట యాకోబు ఒక స్తంభము, అనగా రాతిస్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను.
Gen 35:15 తనతో దేవుడు మాటలాడినచోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలునుండి ప్రయాణమై పోయిరి.
Gen 35:16 ఎఫ్రాతాకు వెళ్లు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను.
Gen 35:17 ఆమె ప్రసవమువలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతోభయపడకుము; ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను.
Gen 35:18 ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.
Gen 35:19 అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను.
Gen 35:20 యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము.
Gen 35:21 ఇశ్రాయేలు ప్రయాణమై పోయి మిగ్దల్ ఏదెరు కవతల తన గుడారము వేసెను.
Gen 35:22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉప పత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.
Gen 35:23 యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు.
Gen 35:24 రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను.
Gen 35:25 రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.
Gen 35:26 లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.
Gen 35:27 అబ్రాహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమ్రేలో కిర్య తర్బాకు తన తండ్రియైన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను.
Gen 35:28 ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సరములు.
Gen 35:29 ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి.

No comments:
Post a Comment