Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, October 10, 2013

ఆదికాండము 39

Gen 39:1  యాసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను.
Gen 39:2  యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను.
Gen 39:3  యెహోవా అతనికి తోడై యుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు
Gen 39:4  యోసేపుమీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతి కప్పగించెను.
Gen 39:5  అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణ కర్తగా నియమించినకాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదిం చెను. యెహోవా
Gen 39:6  అతడు తనకు కలిగిన దంతయు యోసేపు చేతి కప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెన
Gen 39:7  అటుతరువాత అతని యజ మానుని భార్య యోసేపుమీద కన్నువేసితనతో శయ నించుమని చెప్పెను
Gen 39:8  అయితే అతడు ఒప్పకనా యజ మానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెనుగదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు.
Gen 39:9  నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప గింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను.
Gen 39:10  దిన దినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడుకాడు.
Gen 39:11  అట్లుండగా ఒక నాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు.
Gen 39:12  అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.
Gen 39:13  అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించు కొనిపోవుట ఆమె చూచినప్పుడు
Gen 39:14  తన యింటి మను ష్యులను పిలిచిచూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మనయొద్దకు తెచ్చి యున్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకురాగా నేను పెద్దకేక వేసితిని.
Gen 39:15  నేను బిగ్గరగా కేకవేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెనని వారితో చెప్పి
Gen 39:16  అతని యజమానుడు ఇంటికి వచ్చువరకు అతని వస్త్రము తనదగ్గర ఉంచుకొనెను.
Gen 39:17  అప్పుడామె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను నీవు మనయొద్దకు తెచ్చిన ఆ హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నాయొద్దకు వచ్చెను.
Gen 39:18  నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారి పోయెననెను
Gen 39:19  కాబట్టి అతని యజమానుడుఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి
Gen 39:20  అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెర సాలలో ఉండెను.
Gen 39:21  అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతని యందు కనికరపడి అతనిమీద ఆ చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుచేసెను.
Gen 39:22  చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీల నందరిని యోసేపు చేతి కప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు.
Gen 39:23  యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిగూర్చియు విచారణ చేయక యుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను.

No comments:

Post a Comment